Hyderabad, ఫిబ్రవరి 13 -- వాలెంటైన్స్ డే గురించి ఎక్కువమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు వస్తుంది గాలెంటైన్స్ డే. ఇది కేవలం అమ్మాయిల కోసమే. అమ్మాయిలు ఈరోజు ఈ దినోత్సవాన్ని వేడుకలు నిర్వహించుకోవాలి... అది కూడా తమ స్నేహితురాళ్ళతో. ఈ గాలెంటైన్స్ డే అమ్మాయిలు వారి స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి పుట్టుకొచ్చిన ప్రత్యేక దినోత్సవం వాలెంటైన్స్ డే ప్రేమికులకు అంకితం చేస్తే... గాలెంటైన్స్ డే అమ్మాయిలు తమ స్నేహితురాళ్లకు అంకితం చేసే పండుగ.

జీవితంలో స్నేహితులంటే ఆడా మగా ఇద్దరూ వస్తారు. కానీ ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయితో స్నేహం చేస్తే ఉన్నంత కంఫర్ట్, ఆనందం అబ్బాయితో చేస్తే ఉండదు. అమ్మాయిలకు ఎంతైనా తమ స్నేహితురాల్లో ప్రత్యేకమే. అందుకే అలాంటి వారి కోసమే ఏర్పాటయింది గాలెంటైన్స్ డే.

గాలెంటైన్స్ డేను మీ జీవితంలో మీ కష్టసుఖాల్లో తోడున...