భారతదేశం, జనవరి 31 -- గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయింది.. వారు ఏనాడు కంటి నిండా నిద్రపోలేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారన్న సీఎం.. తన గళంతో సమాజానికి స్పూర్తినిచ్చారని కొనియాడారు. గద్దర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లలో రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు.. ఒంటరిగా అనిపించినప్పుడు.. గద్దర్‌తో మాట్లాడేవాన్నని చెప్పారు. పోరాటానికి ప్రజల గుర్తింపు ఉంటుందని.. స్పూర్తిని నింపేవారని గుర్తుచేశారు.

'చరిత్రపుటల్లో గద్దర్‌కు ఒక పేజీ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని భావించాం. గద్దర్‌కు లక్షలాది మంది అభిమానులున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం ద్వారా భవిష్యత్త్ తరాలకు స్పూరినివ్వాలని.. ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. గద్దర్ అవార్డును ఏర్పాటు చేసి.. భట్టి ...