భారతదేశం, ఏప్రిల్ 16 -- తెలుగు సినీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా గద్దర్ అవార్డులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ 2023 వరకు విడుదలైన సినిమాలకు ఈ ఏడాది అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. తొలిసారి గద్దర్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా సీనియర్ నటి జయసుధ ఎంపికయ్యారు. ఆమె అధ్యక్షతన నేడు (ఏప్రిల్ 16) జ్యూరీ సమావేశం జరిగింది.

హైదరాబాద్‍లోని ఎఫ్‍డీసీ మీటింగ్ హాల్‍లో గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశం జరిగింది. 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ ఛైర్‌పర్సన్‍ జయసుధతో నేడు భేటీ అయ్యారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍‍మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‍డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‍రాజు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినీ రంగానికి అవార్డులను ఇస్తోందని, గద్దర్ అవార్డులకు జాతీయస్థా...