భారతదేశం, ఫిబ్రవరి 2 -- Gachibowli Gun Fire : గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అతడి వసతి గృహం నుంచి పోలీసులు మూడో దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పబ్ వద్ద హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామి రెడ్డిపై కాల్పులు జరిపిన ప్రభాకర్, ఓ మల్టీనేషనల్ సంస్థలో పనిచేస్తున్న స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు.

అరెస్టు సమయంలో నిందితుడు ప్రభాకర్ నుంచి అధికారులు ఇప్పటికే రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద ప్రభాకర్ ఈ ఆయుధాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి గదిలో 460 బుల్లెట్లు లభించాయి. వైజాగ్ సెంట్రల్ జైలుకు చెందిన ఓ ఖైదీపై ప్రతీకారం తీర్చుకోవడమే తన ఉద్దేశం అని దర్యాప్తులో ప్రభాక...