భారతదేశం, మార్చి 22 -- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ జరిగింది. డబుల్ డెక్కర్ బస్ చక్రాల కింద ద్విచక్ర వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.

టీఎన్జీవో కాలనీకి చెందిన ప్రభాతి ఛత్రియ.. పదో తరగతి పరీక్షలు రాస్తోంది. పరీక్ష ముగిశాక.. ఆమె అన్నయ్య సుమన్ ఛత్రియ వచ్చి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తున్నాడు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా.. ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరిగింది. బైక్ డబుల్ డెక్కర్ బస్ చక్రాల కింద పడిపోయింది. ఈ ఘటనలో చెల్లి ప్రభాతి ఛత్రియ చనిపోయింది. సుమన్ ఛత్రియకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ట్రాపిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా ...