భారతదేశం, ఏప్రిల్ 16 -- Gaami OTT: విశ్వ‌క్‌సేన్ గామి మూవీ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోంది. నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉన్న ఈ మూవీ 72 గంట‌ల్లోనే యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. అతి త‌క్కువ టైమ్‌లో ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న మూవీగా నిలిచింది.

గామి సినిమాలో విశ్వ‌క్ సేన్ అఘోరా పాత్ర‌లో న‌టించాడు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతో విధ్యాధ‌ర్ కాగిత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌తో పాటు క‌థ, క‌థ‌నాలు, టెక్నిక‌ల్ వాల్యూస్ అద్భుత‌మంటూ ప్రేక్ష‌క‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది.

గామి మూవీ షూటింగ్ ఆరేళ్ల పాటు సాగ‌డం గ‌మ‌నార్హం. 2018లో ఈ మూవీని అనౌన్స్ చేశా...