భారతదేశం, ఫిబ్రవరి 23 -- Future City Metro :హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోని అద్భుత నగరాల సరసన చేరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఏండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న ఫ్రూచర్ సిటీ కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో ఈ గ్రీన...