Hyderabad, జనవరి 27 -- గర్భధారణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇద్దరి ఆరోగ్యానికి హాని కలగవచ్చు. తల్లి తినే ఆహారం ఆమె ఆరోగ్యంపై, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. సరైన అవగాహన లేకుండా గర్భిణీలు కొన్ని రకాల పదార్థాలను, పానీయాలను తినడం వంటివి చేస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా భావించే కొన్ని పండ్లు గర్భధారణ సమయంలో మాత్రం తల్లీబిడ్డల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఆ పండ్లు ఏమిటో తెలుసుకోండి. వీటిని గర్భం ధరించాక తక్కువగా తీసుకుంటే మంచిది.

గర్భధారణ సమయంలో తీపిగా పుల్లగా ఉండే పైనాపిల్ తినడం మంచిది కాదు. పైనాపిల్ లో 'బ్రోమెలైన్' అనే మూలకం ఉంటుంది. ఇది గర్భధారణలో హానికరంగా మారుతుంది. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలు...