Hyderabad, మార్చి 30 -- పండ్లు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక రకాల ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగాలన్నా, అధిక బరువు తగ్గాలన్నా పండ్లను సరైన రీతిలో డైట్లో చేర్చుకుంటే చాలని చెబుతారు. ఇలాంటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినచ్చా? పరగడుపున పండ్లు తినడం వ్లల శరీరంలో కలిగే మార్పులేంటి? ఉదయాన్నే తినగలిగే ఉత్తమమైన ఆహారాలేంటి వంటి విషయాలను తెలుసుకుందా రండి..

రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించాలి అనుకునే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే.. పండ్లను ఖాళీ కడుపుతో తినాలా వద్దా అని. వాస్తవానికి ఉదయం ఆహారం తినడం అంటే రాత్రిపూట ఉపవాసాన్ని విరమించుకోవడం అని. అంటే దాదాపు 12 గంటల పాటు కడుపు ఖాలీగా ఉన్న తర్వాత తిరిగి మొదటగా తి...