Hyderabad, మే 14 -- బరువు త్వరగా తగ్గేందుకు ఎంతో మంది రాత్రి పూట పండ్లను మాత్రమే తింటూ ఉంటారు. రోటీ,చపాతీ, అన్నం మానేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎంతో మంటి నమ్మకం. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన పండ్లు మీ శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు ఆరోగ్యకరమైన ఎంపిక. ఏదేమైనా, అన్నం తినడం మానేసి, ఒక ప్లేట్ నిండా పండ్లు తినడం మంచిదేనా?

బరువు తగ్గేందుకు ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆహారాన్ని తినేవారు ఎంతోంది. పొట్ట మాడ్చుకుని బరువు తగ్గాలని భావిస్తారు. ఎంతో మంది రాత్రి భోజనం మానేసి ఏమీ తినకుండా ఉంటారు. మరి కొందరు కేవలం పండ్లను మాత్రమే తింటారు. రాత్రి భోజనంలో ఇలా పండ్లు మాత్రమే తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? ఆహారం తినేటప్పుడు సమతులాహారం ఉండేలా చూస...