Hyderabad, జనవరి 2 -- చలికాలం అయినా, వేసవి అయినా ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ మాత్రం పనిచేయాల్సిందే. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, ఎక్కువ కాలం వస్తువులను నిల్వ చేయడానికి ఫ్రిజ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఫ్రిజ్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొన్ని ఇళ్లల్లో ఫ్రిజ్ పేలే సంఘటనలు జరిగాయి. ఫ్రిజ్ పేలితే ఆ ఇంట్లోని వారికి ఎంతో ప్రమాదకరం కూడా. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీ ఖరీదైన ఫ్రిజ్ ను త్వరగా చెడిపోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్ పేలిపోతుంది. కాబట్టి ఫ్రిజ్ వాడే వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

శీతాకాలంలో ఆహారం, పానీయాలు సహజంగా చాలా రోజులు తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎంతో మంది ఫ్రిజ్ ను వాడకుండా ఆఫ్ చేస్తేస్తారు. ఈ అలవాటు ఎంతమాత్రం సరైనది కానప్పటికీ, మీరు ఎక్క...