భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో కంటెంట్ చూడాలని అనుకుంటున్నారా.. అయితే వాలెంటైన్స్ డే కూడా ఉన్న ఈ శుక్రవారం ఫిబ్రవరి 14న ఐదు ఇంట్రెస్టింగ్‍ రిలీజ్‍లు ఉన్నాయి. సూపర్ హిట్ అయిన వైలెంట్ మూవీ మార్కో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఓ హిందీ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మూడు వెబ్ సిరీస్‍లు ఇంట్రెస్టింగ్‍గా అనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న ఐదు ఆసక్తికరమైన రిలీజ్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ధూమ్ ధామ్ చిత్రం మంచి బజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ శుక్రవారం ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఈ క్రైమ్ కామెడీ సినిమాలో ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి అయిన రోజు రాత్రే అనుకోని ఘటనలు జరగడం చుట్టూ ధూమ్ ధామ్ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి...