Hyderabad, మార్చి 7 -- జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే అది సాధించేవరకు మరొక ఆలోచన చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే కోతిలాంటి మనసు పట్ల నియంత్రణ ఉండాలి. పంచేంద్రియాలపై నిగ్రహం చాలా అవసరం. ఎవరైతే తమ మనసును నియంత్రణలో ఉంచుకుంటారో, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వారు జీవితంలో అనుకున్నది సాధించే తీరుతారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు.

ఇంద్రియ నిగ్రహానికి మనసుపై నియంత్రణ సాధించేందుకు అర్జునుడినే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాత్రి అందమైన అప్సరస ఊర్వశి అతని వద్దకు వచ్చి నిలుచనుంది. ఆ సమయంలో కూడా అర్జునుడికి తన లక్ష్యం మాత్రమే గుర్తొచ్చింది. ఇంద్రియ నిగ్రహంతో ఆమె ఎంత కవ్వించిన తన మనసును నియంత్రణలో ఉంచుకున్నాడు. ఆమెను గౌరవంగా చూసాడు. తల్లి అని గౌరవంగా పిలిచాడు. అందుకే అర్జునుడి గురించి ఇప్పటివరకు చెప్పుకుంటూనే ఉంటారు....