Hyderabad, మే 3 -- Friday Motivation: ఒక ఊరిలో జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక గ్రామంలో నివసిస్తూ వ్యాపారం చేసేవాడు. అతనికి ఒక అందమైన భార్య, కొడుకు ఉన్నారు. అతను ఎప్పుడు సంతోషంగా కనిపించేవాడు కాదు. జీవితంలో సమస్యలు వస్తూనే ఉన్నాయంటూ ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉండేవాడు. ఒకసారి వారి గ్రామానికి సాధువు వచ్చాడు. ఒకసారి తనతో పాటు కొంతమంది శిష్యులను, 100 ఒంటెలను తీసుకొని వచ్చాడు.

సాధువు దగ్గరికి ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి వెళ్లడం ప్రారంభించారు. జేమ్స్‌కు ఆ సాధువు గురించి తెలిసి తాను కూడా వెళ్ళాడు. జేమ్స్ వెళ్లేసరికి వందల మంది జనం కనిపించారు. చాలా సేపు నిరీక్షించాక జేమ్స్‌కు సాధువును కలిసే అవకాశం వచ్చింది. ఆ సాధువుతో 'స్వామి నా జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక్కోసారి వ్యాపారంలోని టెన్షన్లు, ఒక్కోసారి కుటుంబ సమస్యలు, ఇంకోసారి ఆ...