Hyderabad, మార్చి 21 -- గజిబిజితో కూడిన జీవితంలో చాలా మంది నవ్వడం మర్చిపోతున్నారు. వాళ్ల మీద వాళ్లు శ్రద్ధ చూపించుకోవడమే మానేస్తున్నారు. అదేంటని అడిగితే ప్రపంచంలో ఎవరికీ లేని సమస్యలు వారికే ఉన్నట్లు, అందరికన్నా అతి పెద్ద సమస్యతో వారు ఇబ్బందు పడుతున్నట్లు ఫీలవుతున్నారు. ఎప్పుడూ బాధపడుకుంటూ, ఏదో ఒక విషయం గురించి చింతిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటనీ సంతోషంగా ఉండటం ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని సద్గురు చెబుతున్నారు. ఎల్లప్పుడూ బాధపడుతూ, చింతిస్తూ ఉండేవారి కోసం ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు.

వీటిని పాటిస్తే జీవితంలో ఎన్ని ఇబ్బందుకు వచ్చినప్పటికీ ముఖంలో చిరునవ్వు చెదరిపోదని చెబుతుూ.. "నిజానికి సంతోషం అనేది ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం లేదా లక్ష్యం. తాను ఎంత డబ్బు సంపాదించినా అది అతను, అతని కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచ...