Hyderabad, మార్చి 14 -- ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నా అయినా కానీ జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాను అని బాధపడేవారు చాలా మంది ఉంటారు. నిజానికి జీవితంలో సక్సెస్ అవడం అంత సులభం కాదు. కష్టపడాలి ఏళ్ల తరబడి కష్టపడాలి అప్పుడే విజయం దక్కుతుంది. అలాగని శారీరకంగా శ్రమిస్తే చాలనుకుంటే పొరపాటు. మానసికంగా చాలా రకాలుగా శ్రమించాలి, చాలా బలంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మనం విజయం దక్కించుకోవడానికి మనం ఎంత కష్టపడ్డా మన చుట్టు పక్కల వాళ్లు మనల్ని గెలవనివ్వరు. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్న ప్రతిసారి వెనక్కి లాగేస్తుంటారు. అది మీ స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కూడా అయి ఉండచ్చు. కనుక వారి దగ్గర మీరు కొన్నివిషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. లేదంటే మీరు జ...