Hyderabad, మార్చి 17 -- కొత్తిమీర వేస్తే ఏ వంటకం రుచి అయినా రెట్టింపు అవుతుంది. అందుకే మార్కెట్లో కొత్తిమీర అమ్మకాలు కూడా అధికంగానే ఉంటాయి. ప్రతి వంట గదిలో కొత్తిమీరను కచ్చితంగా వాడుతారు. అయితే వేసవిలో కొత్తిమీరను సరిగ్గా నిలువ చేసుకోవాలి. లేకపోతే ఆహారం రుచి మారిపోతుంది. ఫ్రిజ్లో పెట్టినా కూడా కొత్తిమీరను సరైన పద్ధతిలో నిల్వ చేస్తేనే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇక్కడ మేము కొత్తిమీరను అధిక మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దాన్ని వారం పాటు తాజాగా ఎలా ఉంచుకోవాలో చెప్పాము.

కొత్తిమీర ఆకులను ఒకసారి నీటితో తడిపి శుభ్రం చేయండి. తర్వాత కొత్తిమీరను వేళ్ళతో సహా కాండానికి టిష్యూ పేపర్ను చుట్టండి. అలా చుట్టాక దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. ఇలా అయితే అది తాజాగా ఉండే అవకాశం ఉంది. రోజులో రెండు మూడుసార్లు టిష్యూ పేపర్ పై నీళ్లు చల్లుతూ ఉంటే కొత్తిమ...