Hyderabad, మే 23 -- French Open 2024: బహుషా తన కెరీర్లోనే చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న లెజెండరీ ప్లేయర్ రఫేల్ నదాల్ కు తన ఫేవరెట్ ఫ్రెండ్ ఓపెన్ తొలి రౌండ్లోనే పెద్ద సవాలు ఎదురు కానుంది. అతడు నాలుగో సీడ్, టాప్ ఫామ్ లో ఉన్న అలెగ్జాండర్ జ్వెరెవ్ తో తలపడనున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మే 26 నుంచి పారిస్ లోని రోలాండ్ గారోస్ లో ప్రారంభం కానుంది.

కెరీర్ చరమాంకంలో ఉన్న స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ తన కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ తోనే కెరీర్ ముగించే అవకాశం ఉంది. రోలాండ్ గారోస్ లో నదాల్ కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. అతడు ఇక్కడ ఏకంగా 112 మ్యాచ్ లలో విజయాలు సాధించగా.. కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు.

కెరీర్లో అత్యధికంగా 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. మహా మహా ప్లేయర...