భారతదేశం, మార్చి 14 -- Freezing light: ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటి సారి కాంతిని ఫ్రీజ్ చేశారు. ఘన పదార్ధంగా మార్చారు. కాంతిని సూపర్ సాలిడ్ గా వ్యవహరించేలా చేయవచ్చని తాజా పరిశోధన ద్వారా నిరూపించారు. ఈ పరిశోధన క్వాంటమ్ కంప్యూటింగ్, ఆప్టికల్ టెక్నాలజీల్లో గొప్ప పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.

ఘన పదార్ధంలా ఉంటూనే, ఘర్షణ లేని అరుదైన ప్రవాహ స్థితిలో కాంతిని ఫ్రీజ్ చేయగలిగారు. ఇటీవల 'నేచర్'లో ప్రచురితమైన ఈ ఆవిష్కరణ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆప్టికల్ టెక్నాలజీలలో భవిష్యత్తు అనువర్తనాలలో విప్లవాత్మక మార్పులను సూచిస్తుంది.

సూపర్ సాలిడ్ అనేది పదార్థం యొక్క ఒక అసాధారణ దశ. ఇది ఏకకాలంలో ఘనపదార్థం యొక్క దృఢత్వాన్ని మరియు సూపర్ ఫ్లూయిడ్ వలె ప్రవహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ...