భారతదేశం, మార్చి 7 -- Free DSC Coaching: ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఆశావహులకు బీసీ సంక్షేమ శాఖ తీపికబురు అందించింది. పరీక్షకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి సవిత తెలిపారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

డిఎస్సీ శిక్షణ కోసం మార్చి 10 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ కు ఏర్పాట్లు పూర్తి ...