భారతదేశం, జనవరి 3 -- ఫార్ములా ఈ-కారు రేసు కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఇటీవలనే కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇవ్వగా.. తాజాగా ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చింది. ఫార్ములా -ఈ రేసింగ్‌ కేసులో జనవరి 6న ఉదయం 10గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ, ఏసీబీ నోటీసుల నేపథ్యంలో. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....