కర్నూల్,ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 28 -- మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్న ప్రకటించారు. ఈ మేరకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.

సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రకటనలో ఇంతియాజ్ పేర్కొన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని.. కర్నూలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయానని ప్రస్తావింఛారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి...