Hyderabad, మార్చి 25 -- ప్రతి మహిళకు తల్లి కావడం అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన బహుమతి, గర్భిణీగా తొమ్మిది నెలల పాటు శిశువును మోసే క్షణాలు వారి జీవితంలోనే అత్యంత విలువైన క్షణాలు. అప్పటివరకూ కేవలం వ్యక్తిగానే ఆలోచించే స్త్రీ గర్భవతి అయిన తర్వాత ఆమెలో మాతృత్వ భావన ఏర్పడుతుంది. ఆ క్షణం నుండి, తన బిడ్డ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో ప్రతి తల్లి తన బిడ్డ ఆరోగ్యంగా, అందంగా, తెలివిగా ఉండాలని కోరుకుంటుంది. బిడ్డ అందం, తెలివి అనేది చాలా వరకూ జెనెటికల్‌గానే వస్తాయి.

కానీ, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే, బిడ్డ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మరింత తెలివిగా కూడా ఉంటుందట.

బిడ్డ శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉండటానికి గర్భధారణ సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత...