Hyderabad, మార్చి 17 -- చీర కట్టుకుని బయటకు లేదా ఫంక్షన్లకు వెళ్లాలనుకున్నప్పుడు చీరకు తగిన బ్లౌజు, గాజులు, జువెల్లరీ, నెయిల్ పాలీష్ వంటివన్నీ ముందే రెడీ చేసుకుంటారు. కానీ చెప్పుల విషయానికి వచ్చే సరికి పట్టించుకోరు. చాలా మంది మహిళలు చెప్పుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. చీరలో కాళ్లు ఎలాగూ కనిపించవు కదా, ఏది వేసుకుంటే ఏమవుతుందిలే అనుకుని వాటి మీద పెద్దగా శ్రద్ద చూపించరు. నిజానికి ఇది చాలా మంది చేస్తున్న పొరపాటని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. చీరలో కాళ్లు కనిపించవు కాదా ఏది వేసుకున్నా ఒకటే అని అభిప్రాయం చాలా తప్పని చెబుతున్నారు.

వాస్తవానికి చీర కట్టుకున్నప్పుడు పాదాలను, పాదరక్షలను ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నారంటే.. మీరు తప్పుడు చెప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు, నడుస్తున్నడు, వెహికిల్ నుంచి దిగుతున్నప్పు...