భారతదేశం, ఫిబ్రవరి 13 -- Footballer Dies of lightning: ఇప్పుడో షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పిడుగు పడి ఓ ప్లేయర్ చనిపోయాడు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. సదరు ప్లేయర్ పై పిడుగు పడిన వీడియో వైరల్ అయింది. పిడుగు పడిన తర్వాత కూడా అతడు ఊపిరి తీసుకుంటూనే ఉన్నాడని, హాస్పిటల్ చేరేలోపే చనిపోయినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఫుట్‌బాలర్ ఇలా పిడుగు పడి చనిపోవడం అనేది అసాధారణమైన ఘటనే. ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ ప్లేయర్ పై పిడుగు పడింది అంటూ ఓ యూజర్ సోషల్ మీడియా ఎక్స్ లో ఈ వీడియో షేర్ చేశాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆ ప్లేయర్ అటూ ఇటూ కదలడం వీడియోలో చూడొచ్చు. సరిగ్గా అతడు వెళ్లిన ప్లేస్ లోనే పిడుగు పడింది.

ఆ వెంటనే పక్కనే ఉన్న ప్లేయర్స్ అందరూ పరుగెత్తుకుంటూ ఆ ప్లేయర్ దగ్గరికి వెళ్లారు. ...