Hyderabad, ఏప్రిల్ 7 -- మనలో చాలా మందికి పాదాల వాపు అనేది సాధారణ సమస్యే. కొందరిలో వయస్సుతో పాటు కలిగితే మరికొందరిలో ఇంకొన్ని కారణాల వల్ల కలగొచ్చు. అవేంటంటే, ఎక్కువసేపు ఒకే చోట నిలబడి ఉండటం లేదా కూర్చోవడం, గాయాలు లేదా మూర్ఛ రావడం, గర్భధారణ, కొన్ని మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు, తీవ్రమైన మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు కూడా కాలి వాపుకు కారణం కావచ్చు. సాధారణ కారణాల వల్ల మీ పాదాలలో వాపు వస్తే, ఇంటి చిట్కాలను వాడి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాలి వాపును తగ్గించే ప్రభావవంతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

గాయంపై ఐస్ ప్యాక్ లేదా ఐస్ బాత్ వంటి చల్లని పదార్థంతో కాపండి. ఇవి, మీ రక్తనాళాలను సంకోచింపజేసి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. వాపు ఉన్న కాలిపై ఐస్ ముక్క పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

వెంటనే ఉపశమనం పొందడం కోసం, ఎప్సమ్ సాల్ట్ కలిగిన వెచ్చని నీటిలో ...