Hyderabad, ఫిబ్రవరి 24 -- పీరియడ్స్ సమయంలో మహిళలు కొన్ని రకాల ఆహారాలు తినేందుకు ఇష్టపడరు. వాటిపై ఎన్నో అపోహలు ఉంటాయి. అలాగే చల్లటి నీరు తాగడం ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాలు తినకూడదని కూడా భావిస్తూ ఉంటారు.

అలా చల్లటి పదార్థాలు తినడం, తాగడం చేస్తే కడుపునొప్పి ఎక్కువైపోతుందని, పొట్ట దగ్గర తిమ్మిరిగా అనిపిస్తుందని చెబుతారు. అలాగే రుతుక్రమం క్రమరహితంగా మారిపోతుందని కూడా అంటారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో చల్లని పదార్థాలు తినకూడదని కొందరిలో ఒక అపోహ ఉంది. పీరియడ్స్ సమయంలో చల్లని పదార్థాలు లేదా పానీయాలు తాగడం వల్ల శరీరం ఒక్కసారిగా షాక్ కు గురైనట్టు అవుతుంది. దీనివల్ల రుతుచక్రం తీవ్రంగా ప్రభావితం అవుతుందని అంటారు. చల్లని ఉష్ణోగ్రత కారణంగా గర్భాశయ కండరాలు సంకోచిస్తాయని, ఇవి క్రమ రహిత రుతుస్రావానికి కా...