Hyderabad, జనవరి 31 -- సాధారణంగా మనం ఏదైనా ఆహార పదార్థాన్ని కొనాలంటే ముందుగా దాని గడువు తేదీని చూస్తాం. కొద్ది వారాల పాటు ఎక్స్‌పైరీ కాదని తెలిస్తేనే కొని ఇంటికి తెచ్చుకుంటాం. అలాంటిది అసలు గడువు తేదీతో సంబంధం లేకుండా ఎన్ని రోజులపాటైనా ఒకేలా ఉండే వంటింట్లో వస్తువులేంటో తెలుసా..? సంవత్సరాల తరబడి వినియోగించుకోదగ్గ వస్తువుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కువ రోజులు ఉంటే పాడవుతాయనే అపోహ నుంచి బయటపడదాం.

చక్కెర ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ఫలితాల గురించి అటుంచితే, ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువు చక్కెర. చాలా మంది ఇంట్లో చక్కెర చాలా కాలం పాటు ఉంటే, గడ్డ కడుతుందనో, పాడైపోతుందనో అపోహ పడుతుంటారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉంచినా కూడా పాడవదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. చక్కెర తీసుకునే ప్రతి సమయంలోనూ పొడి స్పూన్ మాత్రమ...