భారతదేశం, మార్చి 7 -- మచ్​ అవైటెడ్​ యాపిల్​ ఫోల్డెబుల్​ ఐఫోన్​పై చాలా కాలంగా రూమర్స్​ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కంపెనీ స్టాండర్డ్స్​కి తగ్గట్టు పార్ట్​లు లేకపోవడంతో ఈ డివైజ్​ ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ యాపిల్​ తొలి ఫొల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై మరో వార్త బయటకు వచ్చింది. 2026లో యాపిల్ తన మొదటి ఫోల్డెబుల్ ఐఫోన్​ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టెక్​ విశ్లేషకుడు చి కువో ప్రకారం ఈ ఫోల్డెబుల్​ ఐఫోన్​ 2026లో లాంచ్​ అవ్వొచ్చు. అంతేకాదు, యాపిల్​ తొలి ఫోల్డెబుల్​ ఐఫోన్​ ధర 2000 డాలర్ల కన్నా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది నిజమైతే, ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాడెక్ట్​ అవుతుంది!

ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్ పరిశ్రమ విపరీత...