భారతదేశం, మార్చి 8 -- Flora electric scooter range : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​ని రీ-లాంచ్​ చేసింది కొమాకి ఎలక్ట్రిక్​ సంస్థ. ఈ ఈ- స్కూటర్​ ఎలక్ట్రిక్​ ఎక్స్​షోరూం ధర రూ. 69,000. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో రెట్రో స్టైల్​ డిజైన్​ కనిపిస్తుంది. మొత్తం మూడు కలర్స్​లో ఈ-స్కూటర్​ లభిస్తుంది. అవి.. గార్మెట్​ రెడ్​, జెట్​ బ్లాక్​, సాక్రామెంటో గ్రే.

ఫ్లోరా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో డిటాచెబుల్​ ఎల్​ఐపీఓ4 బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 80కి.మీ నుంచి 100కి.మీల మధ్యలో ఉంటుంది. 0-100శాతం ఛార్జింగ్​కి 4 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. ఇక 0-90శాతం ఛార్జింగ్​కి 4 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.

Komaki Flora electric scooter pri...