Hyderabad, ఫిబ్రవరి 25 -- Flop Movies Of Failed Combinations In Telugu: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారి కలయికలో సినిమాలు వస్తున్నాయంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలా కొన్ని కాంబినేషన్స్ హిట్ కొడితే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోయాయి. మరి ఫెయిల్యూర్ కాంబినేషన్స్‌గా మిగిలిన తెలుగు సెలబ్రిటీలు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటి కియారా అద్వానీ కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్‌గానే మిగిలిపోయాయి. బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుని గోల్డెన్ హీరోయిన్ అనిపించకున్న కియారా అద్వానీ వినయ విధేయ రామ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రెండోసారి న...