Hyderabad, మార్చి 19 -- ఇంటిని ప్రతిరోజూ మాప్ చేసేవారు ఎంతోమంది. ఇలా చేయడం వల్ల ఫ్లోర్ పరిశుభ్రంగా ఉండటమే కాదు దానిపై బ్యాక్టీరియా కూడా చేరదు. వేసవిలో ఈగలు అధికంగా చేరుతాయి. ఈగల నుంచి తప్పించుకోవాలంటే ప్రతి రోజు మాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మాఫింగ్ వల్ల ఇల్లు పూర్తిగా శుభ్రపడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇల్లంతా సువాసన వచ్చేలాగా మార్చేసుకోవాలి. దీనికోసం మీరు మాప్ చేసే నీటిలో ఎలాంటివి కలపాలో తెలుసుకోండి.

ఫ్లోర్ మీద చాలా జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి. ఇంట్లో వాటర్ మెలన్ తింటే దాని జ్యూస్ కిందపడినా చాలు జిడ్డుగా మారిపోతుంది. అలాగే మామిడి జ్యూస్ కిందపడిన కూడా పురుగులు, చీమలు, ఈగలు చేరుకుంటాయి. కాబట్టి జిడ్డు మరకలు పోవాలంటే మాప్ చేసే నీటిలో బేకింగ్ సోడాను కలపండి. ఇది నూనె, జిడ్డు ...