Hyderabad, ఫిబ్రవరి 27 -- ఏ మనిషికైనా కిడ్నీలు రెండే ఉంటాయి. ఆ వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయాలి. కానీ మన దేశంలో ఐదు కిడ్నీలు ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. అతను డిఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. పేరు దేవేంద్ర బార్లేవార్. వయసు 45.

దేవేంద్ర గత 15 ఏళ్లగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో తరచూ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ జీవిస్తున్నారు. ఇప్పుడు ఆయన శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఐదు కిడ్నీలు ఆయనకు ఎలా వచ్చాయో కూడా వివరించారు. ఐదు కిడ్నీలు ఉన్నప్పటికీ ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుంది.

ఒక మనిషి రెండు కిడ్నీలతోనే జన్మిస్తాడు. దేవేంద్ర కూడా అలా మొదట రెండు కిడ్నీలతోనే జన్మించారు. అయితే 15 ఏళ్ల క్రితం ఆయనకు తన రెండు కిడ్నీలు పనిచేయడం పూర్తిగా ఆపేసాయి. దీంతో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి క...