Hyderabad, జనవరి 31 -- వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుంది. వృద్ధాప్య ఛాయలు వెంటాడుతాయి. అయితే ఒకప్పుడు 60ఏళ్లకే వచ్చే ఈ సమస్యలు ఇప్పుడు 30 ఏళ్లకే వస్తున్నాయి. ఇందుకు మారుతున్న జీవిన విధానం, కలుషితమైన గాలి, రసాయనాలతో తయారవుతున్న ఆహారాలు అయి ఉండచ్చు. అంటే నేటి రోజుల్లో 30 దాటాయంటే ప్రతి ఒక్కరూ ముసలి వాళ్లు అయిపోవాల్సిందేనా? శరీరం, చర్మం తమన శక్తిని కోల్పోయి బలహీనంగా, వయసు పెరిగినట్టుగా తయారవుతుందా? అంటే కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా జరిగే ప్రమాదం ఉన్నప్పడటికీ దాని నుంచి తప్పించుకోవడం మీ చేతిలోనే ఉందంటున్నారు. ఎలాగో తెలుసుకుందాం.

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత, ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఈ సమయంలో తమ డైట్‌లో ఏమి చేర్చాలి,...