Hyderabad, ఫిబ్రవరి 13 -- First 1 Crore Remuneration Heroine: మన దేశంలో రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు మూవీ కోసం అతడు ఈ మొత్తం అందుకున్నాడు. మరి ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె కూడా ఇటు టాలీవుడ్ తోపాటు అటు బాలీవుడ్ ను ఏలిన తెలుగు నటే కావడం విశేషం.

తెలుగు స్టార్లు, తెలుగు సినిమాలు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకమే. రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నది మన మెగాస్టార్ చిరంజీవియే. అంతేకాదు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ శ్రీదేవి.

ఒకప్పుడు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా ఏలిన ఈ అందాల నటి అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకుంది. నిజానికి తొలి పాన్ ఇండియా స్టార్ కూడా ఆమెనే అని చెప్పొచ్చు. 1993లో వచ్చిన రూప...