భారతదేశం, ఏప్రిల్ 9 -- Fire Accident : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా టపాసులు కాల్చడంతో అవి కాస్త టెంటు మీద పడి మంటలు చెలరేగాయి. దీంతో టెంట్ నుంచి పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్న క్రమంలో స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కంగన్ హాల్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించేందుకు యజమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు టెంట్లు వేయడంతో పాటు బెలూన్ లతో డెకరేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై కంగన్ హాలును ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేకు స్వాగతం పలిక...