భారతదేశం, ఏప్రిల్ 4 -- Fire Accident: ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సెకండ్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బ్యాటరీ రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇన్వర్టర్ బ్యాటరీలు కాలి బూడిదయ్యాయి. బ్యాటరీ రూమ్‌లో పొగలు వస్తుండటాన్ని గుర్తించిన సచివాలయ భద్రతా సిబ్బంది వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
మంటలు అదుపులోకి వచ్చే లోగా బ్యాటరీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. సచివాలయం సెకండ్ బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ పేషీతో పాటు హోంమంత్రి అనిత, పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.