భారతదేశం, నవంబర్ 28 -- Fifa World Cup Croatia vs Canada: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆదివారం కెన‌డాను క్రొయేషియా 4-1 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో కెన‌డాపై క్రొయేషియా సంపూర్ణ‌ ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. క్ర‌మ‌రిక్ రెండో గోల్స్‌తో క్రొయేషియాకు విజ‌యాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో తొలి గోల్ మాత్రం కెన‌డా చేసింది. ఆట ఆరంభ‌మైన రెండో నిమిషంలోనే ఆల్ఫాన్సో డేవిస్ గోల్ చేసి క్రొయేషియాకు షాక్ ఇచ్చాడు. స్కోరును స‌మం చేసేందుకు క్రొయేషియా ఆట‌గాళ్లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు.

36వ నిమిషంలో క్ర‌మ‌రిక్ గోల్ చేసి క్రొయేషియాకు ఊర‌ట‌నిచ్చాడు. 44వ నిమిషంలో వివ‌జా గోల్‌తో క్రొయేషియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. 70వ నిమిషంలో మ‌రో గోల్ చేసిన క్ర‌మ‌రిక్ విజ‌యాన్ని ఖాయం చేశాడు.

ఆట చివ‌ర‌లో మ‌జేర్ గోల్‌తో క్రొయేషియా 4-1 తేడాతో కెన‌డాపై విజ‌యాన్ని సాధించింది...