భారతదేశం, నవంబర్ 28 -- Fifa World Cup 2022 Schedule Today: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గ్రూప్ జీ నుంచి నాకౌట్ చేరుకునే టీమ్‌లు ఏవ‌నేది నేడు క్లారిటీ రానుంది. గ్రూప్ జీ నుంచి నేడు రెండు మ్యాచ్‌లు జ‌రుగున్నాయి. బ్రెజిల్‌- స్విట్జ‌ర్లాండ్, కామెరూన్ - సెర్బియా పోరుకు సిద్ధ‌మ‌య్యాయి. గాయం కార‌ణంగా స్విట్జ‌ర్లాండ్ మ్యాచ్‌కు బ్రెజిల్ స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మ‌ర్ దూర‌మ‌య్యాడు. అత‌డి లేని లోటును బ్రెజిల్ ఎలా భ‌ర్తీ చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

సెర్బియాతో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు అదిరిపోయే విక్ట‌రీని అందించాడు రిచ‌ర్ల‌స‌న్‌. నేటి మ్యాచ్‌లో అత‌డు రాణించ‌డంపైనే బ్రెజిల్ గెలుపు అవ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి. స్విట్జ‌ర్లాండ్‌పై గెలిస్తే బ్రెజిల్ నాకౌట్ బెర్త్ ఖ‌రారైన‌ట్లే. అయితే స్విట్జ‌ర్లాండ్ నుంచి బ్రెజిల్‌కు గ‌ట్టిపోటీ ఎదుర‌య్యే ...