Hyderabad, మార్చి 24 -- అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే నచ్చిన బట్టలు వేసుకోవడం కాదు శరీరానికి తగిన బట్టలు వేసుకోవాలని స్టైలింగ్ నిపుణులు చెబుతుంటారు. శరీరానికి తగిన బట్టలు అంటే ఇది మనకు బాగుంటుంది, ఇది మనకు బాగుండదు అని మనకు మనమే డిసైడ్ అవడం కాదు. మన శరీర ఆకృతిని బట్టి మనకు ఎలాంటి దుస్తులు బాగా సెట్ అవుతాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు శరీరీ ఆకృతిని అంటే మీ బాడీ షేప్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆడవారి శరీర ఆకారాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 6 శరీరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

భుజాలు ఛాతి కంటే వెడల్పుగా ఉండి.. నడుము సన్నదిగా ఉంటూ పియర్ షేప్ అంటారు. దీన్నే స్టాబెర్రీ షేప్ అని కూడా పిలుస్తారు.

రొమ్ములు పెద్దవిగా, తుంటి భాగం చిన్నదిగా ఉండి నడుము కాస్త వెడల్పుగా ఉంటే ఆపిల్ షేప్ అంటారు. ఈ శరీరం ఉన్నావాళ్లకి నడుము, తు...