Hyderabad, మార్చి 22 -- మనలో చాలా మందికి ఉదయం లేచినప్పటి నుంచీ అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. ఆహరం సరిగ్గా తీసుకుంటున్నా, వ్యాయామం వంటివి చేస్తున్నా, శరీరానికి కావల్సినంత రెస్ట్ తీసుకుంటున్నా కూడా ఈ ఫీలింగ్ నుంచి బయటకు రాలేదు. కాఫీలు, టీలు వంటి డ్రింక్స్ తాగినా కూడా యాక్టివ్ అవలేరు. మీకూ ఇలాగే జరుగుతుందా? అయితే మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు సమస్య మూలం తెలుసుకోకుండా ప్రయోగాలు చేస్తున్నారని. దీనికి కారణం మీరు ఫాలో అవుతున్న పేలవమైన లైఫ్ స్టైల్, పోషకాల లోపం లేదా బ్లడ్ షుగర్ లో హెచ్చు తగ్గులు, థైరాయిడ్, స్ట్రెస్ కూడా కావొచ్చు. ఒక్కోసారి మీరు తీసుకునే మెడిసిన్ కూడా ఈ సమస్యను పెంచే అవకాశం ఉంది. రోజంతా మీరు అలసట భావంతోనే ఉండటానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసుకోండి.

విటమిన్ B12 రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో, నరాల పనితీరులో కీలకం...