Hyderabad, మార్చి 3 -- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని 80% కంటే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారట. ఇండియన్ ఎకానమీకి ఎక్కువ లాభం చేకూరుస్తున్న ఐటీ రంగం 5.4 మిలియన్లకు మందికి పైగా ఉద్యోగాలను అందిస్తుంది. ఐటీ రంగంలో పనిచేసే వారి గురించి, ఈ రంగంతో సంబంధమున్న వారి ఆరోగ్య తీరు గురించి అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో, సర్వే చేసిన 84% మంది ఐటీ ఉద్యోగులకు మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) ఉందని తేలింది.

జూలై 2023 నుండి జూలై 2024 వరకు హైదరాబాద్‌లో పనిచేస్తున్న 345 మంది ఐటీ ఉద్యోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఎక్కువ సమయం డెస్క్‌లో ఒకే చోట కూర్చోవడం, పని ఒత్తిడి, అస్తవ్యస్తమైన నిద్ర MAFLDకి దోహదం చేస్తాయని అధ్యయనంలో తేలింది. వాస్...