Hyderabad, జనవరి 27 -- Fatima Sana Shaikh: బాలీవుడ్ నటి, దంగల్ మూవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సాధారణం అన్నట్లుగా ఆమె మాట్లాడింది. బాలీవుడ్ బబుల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాతిమా మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఈ ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ.. ఓ ఏజెంట్ తో తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది. "నువ్వు అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా అని అతడు అడిగాడు.

నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేయడానికి నేను చాలా కష్టపడతాను అని నేను అన్నాను. కానీ అతడు మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నేను కూడా అతడు ఎంతకు దిగ...