Hyderabad, ఫిబ్రవరి 16 -- వ్యాయామం అనే ప్రక్రియలో వాకింగ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఇది మీ కేలరీలను సునాయాసంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మెటబాలిజం పెంచి, కండరాలను మంచి షేప్ లోకి మారుస్తుంది. మీ వెయిట్ లాస్ జర్నీలో వాకింగ్ అనేది మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.

వాకింగ్ చేయడంలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. కొందరు ఖాళీ కడుపుతో నడిస్తే, మరికొందరు తిన్న తర్వాత నడుస్తారు. మీరెప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి ఏ సమయంలో వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుందనేది? ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడు వాకింగ్ చేసినా కూడా కేలరీలు ఖర్చవుతాయి. కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏది ఉత్తమమనేది ఓసారి చూసేద్దామా?

ఎవరైనా బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు, ఉపవాసంతో ఉండి నడవటం మంచిది. దీన్ని 'ఉపవాస కార్డియో' అని కూడా పిలుస్తా...