భారతదేశం, ఫిబ్రవరి 21 -- Farmers Protest: ముందస్తు నోటీసు ఇవ్వకుండా మిల్క్ చిల్లింగ్ సెంటర్ ను సీజ్ చేస్తే పాలు ఏం చేయాలని అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు వర్సెస్ పాడి రైతులు అన్నట్లుగా రాజకీయం సాగి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో రాత్రి మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఓపెనింగ్ అయింది.

క‌రీంన‌గ‌ర్ మిల్క్ డెయిరీ ఆధ్వ‌ర్యంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ రూర‌ల్ మండ‌లం ఆగ్ర‌హారం వ‌ద్ద ఏర్పాటు చేసిన మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టించింది.

చిల్లింగ్ కేంద్రానికి ఇండ‌స్ట్రియ‌ల్ అనుమ‌తులు, ఫైర్ సెప్టీ లేవ‌ని ఉన్న‌తాధికారి అదేశాల మేర‌కు సీజ్‌ చేస్తున్న‌ట్లు మున్సిప‌ల్‌, డీపీఓ, ఇండ‌స్ట్రియ‌ల్ అధికారులు ప్ర‌క‌టించారు. చిల్లింగ్ కేంద్రం వ‌ద్ద‌కు వ‌చ్చిన అధికారులు స‌ద‌రు డెయిరీ నిర్వ‌హ‌కుల‌కు ఎటువంటి నోటీసులుగాన...