భారతదేశం, మార్చి 28 -- Family Star Trailer: గీతా గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం రిలీజైంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్, కామెడీ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. స్వామి...కొత్త‌గా నాకు లైఫ్‌లో బ్రేక్‌లు ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఉన్న‌దానిని మాత్రం చెడ‌గొట్ట‌కు అనే విజ‌య్ దేవ‌ర‌కొండ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ట్రైల‌ర్‌లో ట్రెండీ లుక్‌లో మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రెండ్‌షిప్‌లు, తిర‌గ‌డాలు బంద్‌. ఆ పిల్ల ఇంటికి రావ‌డానికి వీలులేదు. మీరు పైకి వెళ్...