భారతదేశం, మార్చి 28 -- Family Star Trailer: గీతా గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం రిలీజైంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్, కామెడీ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మిడిల్ క్లాస్ కుర్రాడిగా స్టైలిష్‌గా క‌నిపిస్తూనే త‌న కామెడీతో ఫ్యాన్స్‌ను న‌వ్విస్తూ ట్రైల‌ర్లో క‌నిపించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్‌, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. విజ‌య్ డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్‌ ట్రైల‌ర్...