భారతదేశం, ఏప్రిల్ 5 -- Fake doctor: మధ్యప్రదేశ్ లోని దామో నగరంలోని ఓ ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసి ఏడుగురిని ఓ నకిలీ వైద్యుడు చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో అతడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని, బ్రిటిష్ డాక్టర్ ఎన్ జాన్ కెమ్ గా నటించి, కార్డియాలజిస్ట్ గా చెప్పుకుంటూ క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరాడని తేలింది. పలువురు రోగులకు ఆ నకిలీ వైద్యుడు గుండె శస్త్రచికిత్సలు చేయగా వారు మృతి చెందారు.

నకిలీ వైద్యుడిపై విచారణ కొనసాగుతోందని, అధికారికంగా మరణాల సంఖ్య 7 అయినప్పటికీ, వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది దీపక్ తివారీ పేర్కొన్నారు. ''కొందరు రోగుల బంధువులు మా వద్దకు వచ్చి ఈ నకిలీ వైద్యుడి గురించి చెప్పారు. తమ తండ్రిని క్రిస్టియన్ మిషనరీ ఆసు...