తెలంగాణ,మెదక్, మార్చి 20 -- అనారోగ్య సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడేస్తానంటూ ఓ బాబా జనాలను నమ్మించాడు. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు అతగాని దందా ఓవైపు సాగుతుండగా. మరోవైపు అమాయక మహిళలను లొంగదీసుకుంటున్నాడు. ఇలా పలువురిని మోసం చేయటంతో. అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో అతగాడి బాగోతం బట్టబయలైంది.! ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి అలియాస్ శివ స్వామి జ్యోతిష్యం చెబుతూ పూజలు చేసేవాడు. ఆరోగ్యం మెరుగు పేరిట మహిళలను నమ్మించేవాడు. మెదక్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన కార్యకలాపాలను సాగించేవాడు.

నిమ్మ కాయ, పసుపు, కుంకుమ వాసనలు చూపిస్తూ.. నీటిలో నిద్ర మాత్రలు కలిపి తన దగ్గరికి వచ్చే మహిళలకు ఇచ్చేవాడు. సదరు మహిళ స...