భారతదేశం, ఏప్రిల్ 6 -- నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ అధికారికంగా జారీ చేస్తారు. వాటిలో పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఇందులో ఫారమ్‌లు, దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు ఉంటాయి. చివరకు ఫలితం, కౌన్సెలింగ్ తేదీలు కూడా అధికారికంగా పంచుకుంటారు. అయితే చాలా సార్లు విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చిన వాటిని కూడా నమ్ముతుంటారు. దానిని షేర్ చేసేముందు ముందు అధికారిక వెబ్‌సైట్‌లో దానిని ధృవీకరించడం చాలా ముఖ్యం.

నీట్ పీజీ పరీక్ష తేదీలకు సంబంధించి సోషల్ మీడియాలో నకిలీ నోటిఫికేషన్ వైరల్ అవుతున్నది వెలుగులోకి వచ్చింది. నీట్ పీజీ షెడ్యూల్ చేసిన తేదీని మార్చారని, ఇప్పుడు ఈ పరీక్ష జూన్ 15కి బదులుగా ఆగస్టు 17 2025న నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే ఈ సమాచారం పూర్తిగా తప్పు. నీట్ పీజీకి సంబంధించి ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ కాలేదు. ...